వైష్ణవి గ్రీన్ వ్యాలీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో ఏఎంసీ చైర్మన్ ప్రత్యేక పూజలు
వైష్ణవి గ్రీన్ వ్యాలీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో ఏఎంసీ చైర్మన్ ప్రత్యేక పూజలు
శరన్నవరాత్రుల తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి దంపతులు
మన భారత్, మావల: అక్టోబర్ 11 ఆదిలాబాద్ జిల్లా మావల పరిధిలోని వైష్ణవి గ్రీన్ వ్యాలీలో కొలువుదీరిన శ్రీ త్రిశక్తి దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజు సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి కాసార్ల సాయితేజ శర్మ ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి పూజలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ
.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశార్ననారు.
నరాత్రుల ప్రారంభంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
