manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 1:52 am Editor : Editor Vishal Kumar

వైభవంగా తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ..

వైభవంగా తొలి రోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’సంబరాలు

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 10, (మన భారత్):

ప్రకృతితో మమేకమయ్యే గ్రామీణ జీవన సంస్కృతికి ఆడపడుచుల ఆత్మగౌరవానికి పత్రికగా నిలిచే “బతుకమ్మ పండుగ”జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో శనివారం ఎంతో ఉత్సాహంగా ఘనంగా ప్రారంభమైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో పువ్వుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. శనివారం బతుకమ్మ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకొని , మహిళలు, యువతులు, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు , అనంతరం గ్రామాల్లోని దేవాలయాల వద్దకు చేరుకొని బతుకమ్మలను ఉంచి సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ, సందడి చేశారు.

పెద్ద సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేడుకల అనంతరం మహిళలు పరస్పరం ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకొని బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు బతుకమ్మకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.