కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 10 మన భారత్ ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గురించి మాట్లాడే ముందు బల్మూర్ వెంకట్ తన స్థాయిని తెలుసుకోవాలని అన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, అందుకే ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని రవి గౌడ్ విమర్శించారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కేటీఆర్ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు.
రాజకీయ విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలకే పరిమితం కావాలని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని రవి గౌడ్ అన్నారు. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలను సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని బల్మూర్ వెంకట్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్,కోడం వెంకటేష్, ఎండి అజ్జు, లింగంపల్లి అబ్బి,పవన్, పవన్, దడికే రాజు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మీ మహేష్ చంద్ర మన భారత్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్
జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
