శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
మన భారత్, భీంపూర్: మండలంలోని శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు....