manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 1:23 am Editor : Editor Vishal Kumar

శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మన భారత్, భీంపూర్: మండలంలోని శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో మన సంప్రదాయాల పట్ల గౌరవం, ఐకమత్యం, సామాజిక స్పృహ పెంపొందుతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం పూల సోయగాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్ విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయంగా నిలిచింది.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.