manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 4:32 pm Editor : Editor Vishal Kumar

ఇసుక బకాసురులకు అండగా..

ఇసుక బకాసురులకు అండగా నిలుస్తున్న అధికారులు.

సిపిఐ ఎం ఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లిమల్లేష్….

టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి ఈ మూడు మండలాల్లో చలి వాగు ప్రవహిత గ్రామాల్లో ఉన్నటువంటి చలివాగులో ఇసుకను విపరీతంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అసలే ఎండాకాలం కొట్టినట్టుగా ఎండలు కొడుతున్నాయి వర్షాలు లేవు ఆ చలి వాగులు నమ్ముకుని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వరి పొలాలువేసినారు పంట చేతికి వస్తుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు విచ్చలవిడిగా ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది తక్షణమే అక్రమ ఇసుక దందాను అరికట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులను జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇసుక తీసుకెళ్తున్న వెహికల్స్ కు ఇన్సూరెన్స్ కాగితాలు డ్రైవర్ కు లైసెన్స్ ఇలాంటివి ఏమీ ఉండటం లేదు ఏదైనా ప్రమాదం జరిగిన దిక్కులేని వీరి నిర్లక్ష్యం పట్లప్రభుత్వ అధికారులు స్పందించిన దాఖలు కనబడడం లేదు తక్షణమే స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామ పంచాయతీల సర్పంచులు గ్రామపంచాయతీ కోసం అని వెహికల్స్ యజమాన్యం దగ్గర ట్రిప్పుకు 200 తీసుకొని ఇసుక అక్రమార్కులకు సహకరిస్తున్నారు తక్షణమే స్పందించకపోతే ఆందోళన తప్పదని అన్నారు

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి