manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 4:13 pm Editor : Editor Vishal Kumar

రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన మెరుగు సురేష్ గౌడ్ 

రాహుల్ గాంధీ అరెస్టును ఖండించిన మెరుగు సురేష్ గౌడ్

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 07, (మన భారత్):

ఓటు హక్కు పరిరక్షణ కోసం, ఓట్ల చోరీపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులు మెరుగు సురేష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం తొమ్మిది గంటల పాటు నిరసన చేపట్టారు. ఎన్నికల కమిషన్ తీరుపై, ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకుని రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎంపీలను అరెస్టు చేశారు.

అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఆకాశవాణి భవన్ వద్ద దాదాపు 9 గంటల పాటు నిరసన కొనసాగించారు. “ఓటు హక్కు గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా?” అని ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా మెరుగు సురేష్ గౌడ్ మాట్లాడుతూ… “రాహుల్ గాంధీ అరెస్టు చాలా దారుణం. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాని గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం బీజేపీ నియంతృత్వానికి నిదర్శనం. ఎన్నికల కమిషనర్ బీజేపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలి. ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు 9 గంటల పాటు చేసిన నిరసన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే. దీనికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అని అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్థాయి నుండి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.