manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:29 pm Editor : Editor Vishal Kumar

రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే

బోథ్‌లో బీఆర్ఎస్‌లో చేరిన వార్డు మెంబర్ నితీష్‌తో పాటు యువత

గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, బోథ్, అక్టోబర్ 6: బోథ్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీలోకి యువత చేరిక జరిగింది. పట్టణానికి చెందిన వార్డు మెంబర్ నితీష్‌తో పాటు పలువురు యువకులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాకేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువత రాజకీయ, సామాజిక రంగాల్లో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేయాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు, గతంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో యువత ముందుండాలని ఎమ్మెల్యే అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే

రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ధీమా వ్యక్తం చేశారు. “వచ్చేది 100 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే” అని పేర్కొంటూ, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

యువత చేరికతో పార్టీకి మరింత బలం

బోథ్ పట్టణంలో యువత బీఆర్ఎస్‌లో చేరడం పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ నితీష్‌తో పాటు శ్రవణ్ రెడ్డి, ఆనంద్, వివేక్, బోగ సాయి, శ్రీకాంత్, రాహుల్, ప్రవీణ్, శ్రీను, రజిని, గంగాధర్, తుము హరీష్, అన్వేష్, గొల్ల వినిత్, రాజేష్, మణికంఠ, రాజు తదితర యువకులు బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు రాజు రెడ్డి, రూప్‌చంద్, సంజయ్, బాబులాల్, అంబాజి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, తాహెర్, ఎలుక రాజు, విడిసి చైర్మన్ పోతన్న, సదానంద్, పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు రాకేష్ రెడ్డి, సంజీవ్, రఫీ, గంగమల్లు, కటకం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.