అంబులెన్స్ తరలింపు వెనుక మర్మమేంటి? విలేకరులను చూసి వాహనం దూసుకెళ్లిందా?
నేరడిగొండ, అక్టోబరు 7:
మొన్నటి శనివారం (అక్టోబరు 3న) కూడా సరిగ్గా ఇలాగే ఆంబులెన్స్ మార్పిడి జరగ్గా, ఈరోజు (బుధవారం) కూడా మళ్లీ అదే తరహాలో షిఫ్టింగ్కు సిద్ధం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను గమనించి స్థానిక విలేకరులు అక్కడికి చేరుకోవడంతో, అప్పటికప్పుడు వాహనాన్ని ఆపకుండా డైరెక్ట్గా ముందుకు తరలించడం తీవ్ర కలకలం రేపింది.
నిర్మల్ నుంచి వస్తున్న ఆంబులెన్స్లలో రోగులను నేరడిగొండ వద్ద వేరే వాహనాల్లోకి ఎందుకు మారుస్తున్నారు? సాధారణంగా 108 లేదా అత్యవసర అంబులెన్స్ నిబంధనల ప్రకారం రోగిని తీసుకొచ్చిన వాహనంలోనే ఆసుపత్రి వరకు చేర్చాల్సి ఉంటుంది. కానీ వరుసగా శనివారం, ఈరోజు ఇలా అర్ధాంతరంగా మార్చడానికి సిద్ధపడటం, విలేకరులు రాగానే వాహనాన్ని ఆపకుండా నేరుగా వెళ్ళిపోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు లేదా సిబ్బంది ఏదైనా సమాచారాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారా? లేక నిబంధనలకు విరుద్ధంగా ఈ షిఫ్టింగ్ ప్రక్రియ సాగుతోందా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు, 108 నిర్వాహకులు తక్షణమే స్పందించి అసలు నిజాలను బయటపెట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
