manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 11:45 pm Editor : Editor Vishal Kumar

రష్యాలో ఉద్యోగం పేరుతో మోసం.. యుద్ధంలోకి బలవంతంగా!

రష్యాలో ఉద్యోగం పేరుతో మోసం.. యుద్ధంలోకి బలవంతంగా!

నారాయణపూర్‌కు చెందిన దొమ్మాటి కిషన్‌ను స్వదేశానికి రప్పించేందుకు బండి సంజయ్ చొరవ

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి :రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లి, అక్కడ బలవంతంగా సైన్యంలో చేర్పించి ఉక్రెయిన్ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధంలోకి పంపిన నారాయణపూర్ గ్రామానికి చెందిన దొమ్మాటి కిషన్ వ్యవహారం కుటుంబ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి వెళ్లింది. తమ కుటుంబ సభ్యుడిని ఎలాగైనా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కిషన్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రిని కోరారు.

కిషన్‌కు రష్యాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లిన అనంతరం అక్కడి సైన్యంలో బలవంతంగా చేర్పించినట్లు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం కిషన్‌ను ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో యుద్ధానికి పంపినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందని, వెంటనే రష్యా నుంచి స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.కుటుంబ సభ్యుల ఆవేదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే స్పందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, దొమ్మాటి కిషన్‌ను సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.కిషన్‌ను స్వదేశానికి రప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చొరవ చూపుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.