manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 4:07 am Editor : Editor Vishal Kumar

పోషణ మాసంలో ఐసీడీఎస్ అధికారులు..

న్యూ ఇస్సిపేట అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 06, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని న్యూ ఇస్సిపేట రెండవ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్
అరుణాదేవి అధ్వర్యంలో 9 వ పోషణ మాసం ప్రోగ్రాం మన అంగన్వాడీ మన బాధ్యత ‘ అనే థీమ్ తో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యంగా,గర్భిణీలకు,బాలింతలకు మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించి ఆమె మాట్లాడారు.అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని అంటే రైస్ తో పాటు చిరుధాన్యాలు,పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని, ఆకుకూరలు, గుడ్లు పాలు ,తీసుకోవాలని అవగాహన కల్పించారు ,ముఖ్యం గా పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకూడదని, ఫోన్ లు చూపేట్టుకుంటు భోజనం తినపెట్టకూడదు సీబీఈ లో భాగంగా కృష్ణ కౌశిక్ అనే అబ్బాయి కి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ,అంగన్వాడీ సెంటర్స్ లో ఇచ్చే భోజనం మెనూ గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ స్వరూప, జ్యోతి, జమున, రోజా ఆయా లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.