నిరుద్యోగ యువతకు ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
నిరుద్యోగ యువతకు ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు. శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం ఆధ్వర్యంలో శిక్షణకు అవకాశం. ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 5(మన భారత్ ప్రతినిధి ): తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా డేటా ఇంజినీరింగ్ కోర్సును అందిస్తున్నట్లు బొప్పాపూర్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ భుజంకార్ శ్రీనివాస్, సభ్యుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంజినీరింగ్...