నిరుద్యోగ యువతకు ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు.
శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం ఆధ్వర్యంలో శిక్షణకు అవకాశం.
ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 5(మన భారత్ ప్రతినిధి ): తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం ఆధ్వర్యంలో పూర్తిగా ఉచితంగా డేటా ఇంజినీరింగ్ కోర్సును అందిస్తున్నట్లు బొప్పాపూర్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ భుజంకార్ శ్రీనివాస్, సభ్యుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా ఇంజినీరింగ్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను పట్టభద్రులకు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
2022–2026 మధ్య ఉత్తీర్ణులకు అవకాశం
2022 నుంచి 2026 మధ్య ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులు ఈ ఉచిత శిక్షణకు అర్హులని భుజంకార్ శ్రీనివాస్, కొండ రమేష్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో తరగతులు పూర్తిగా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
90 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
మూడు దశాబ్దాల బోధనా అనుభవం కలిగిన అధ్యాపకుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఇందులో ప్రాథమిక, అధునాతన పైథాన్, ఎస్క్యూఎల్తో పాటు కృత్రిమ మేధస్సు సాధనాల వినియోగం, డేటా ఇంజినీరింగ్పై ప్రత్యేక శిక్షణ అందిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్, వృత్తి మార్గదర్శనం, ఉద్యోగ ఇంటర్వ్యూలకు సన్నద్ధత వంటి అంశాలపై కూడా శిక్షణ ఇస్తారని తెలిపారు.
శిక్షణ అనంతరం ఉద్యోగ నియామక సహాయం
కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక సహాయం కూడా అందిస్తారని కన్వీనర్ భుజంకార్ శ్రీనివాస్, సభ్యుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు. గత బ్యాచ్లో 350 మందికి పైగా పట్టభద్రులు శిక్షణ పొందగా, వారిలో 100 మందికి పైగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
కోర్సు పూర్తిగా ఉచితమని, అర్హత కలిగిన నిరుద్యోగ పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భుజంకార్ శ్రీనివాస్, కొండ రమేష్ గౌడ్ కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.dakshata.ai వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 9052372023 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
తెలంగాణ యువతలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమల్లో ఉన్న నైపుణ్యాల కొరతను తగ్గించడంతో పాటు నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీ సత్యసాయి దక్షత కార్యక్రమం దోహదపడుతుందని బొప్పాపూర్ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ భుజంకార్ శ్రీనివాస్, సభ్యుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు.
మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
