అంగన్వాడీ సిబ్బందికి బీజేపీ నేతల సన్మానం.
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 6(మన భారత్ ప్రతినిధి ):
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పూర్ణిమ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంరక్షణ, పోషణతో పాటు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను రెడ్డబోయిన గోపి చిరు సన్మానంతో సత్కరించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అరటి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు భీమనపల్లి శోభ, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, పట్టణ నాయకుడు మోర శ్రీహరి, 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి, 38వ వార్డు ఇన్చార్జి మోర శ్రీలతతో పాటు మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
