manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 2:01 pm Editor : Editor Vishal Kumar

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి

ఒక్క ఫోన్ కాల్ చేస్తే…మీకు రక్షణ కవచంలా నిలబడటానికి ‘షీ టీమ్’ ఎల్లప్పుడూ సిద్ధం.

జిల్లాలో గడిచిన రెండు నెలల కాలంలో ఆకతాయిలపై 04 ఎఫ్ఐఆర్ లు 05 పెట్టి కేసులు నమోదు.

హాట్‌స్పాట్స్‌ ల వద్ద షీ టీమ్ మఫ్టీలో నిఘా .. మహిళల భద్రతకు భరోసా.

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 0 6 (మన భారత్ ప్రతినిధి) మహిళలు,బాలికలు,విద్యార్థినిలు ఎలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.గడిచిన రెండు నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 4 ఎఫ్ఐఆర్ లు, 05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…జిల్లాలో మహిళల,విద్యార్థినిల రక్షణకై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని, మహిళలు, విద్యార్థినిలు, బాలికలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు రక్షణ కవచంలా జిల్లా షీ టీమ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాదని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు. జిల్లాలో షీ టీమ్ బృందం విద్యాసంస్థల్లో, మహిళలు పని చేసే ప్రదేశాల్లో,రద్దీగాల ప్రాంతాల్లో విద్యార్థులకు, మహిళలకు,ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ సోషల్ మీడియా మోసాలు/ మహిళ చట్టలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లాలో గుర్తించిన హట్స్పాట్స్ వద్ద షీ టీమ్ బృందం నిత్యం మఫ్టీ డ్రెస్ లలో నిఘా ఉంచి మహిళలను,విద్యార్థిని లను వేధించే ఆకతాయిలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
విద్యాసంస్థలల్లో,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.