ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకుంటాం
డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపాల్ తుటికుర్ల శంకర్ గారి ఆధ్వర్యంలో సమావేశం.
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 6 మన భారత్ ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ తూటికూర్ల శంకర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల లో లెక్చరల్స్ ఎంతో అనుభవం కలిగిన వారు రానున్న రోజులో గొప్ప కళాశాల గా తీర్చుదిద్దుకోవడానికి అందరు సహకరించాలని అన్నారు.ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు నాయకులు మాట్లాడుతూ
ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మండల ప్రజలందరం కలిసి కాపాడుకుంటామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల
జూనియర్ కళాశాల సమీపంలో నడుస్తుందని అన్నారు. అలాగే, త్వరలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి, కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందించే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను భవిష్యత్ తరాలకు మరింత అభివృద్ధి చేసి అందిద్దాం అన్నారు.ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ తుటికుర్ల శంకర్, మండల సర్పంచ్ లా ఫోరమ్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య,ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ సర్పంచ్ ఎనగందుల నర్సింహులు, బుగ్గరాజేశ్వర తండా సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్,రాజన్నపేట్ సర్పంచ్ కల్లూరి బాపురెడ్డి, రిటైర్ టీచర్ గంప నాగేంద్రం సార్, వాసనవేణి పర్శరాములు, నీరటి విష్ణు,వార్డు మెంబర్స్ గంట బాలకృష్ణ,మాలోత్ సాయికిరణ్ నాయక్,వివిధ పార్టీ నాయకులు కానపురం లక్ష్మణ్,నంది కిషన్, గుండడి రామ్ రేడ్డి, అంతరూపుల తిరుపతి,వంగ శ్రీకాంత్, శ్యాగ లక్ష్మణ్, మారావేణి రంజిత్ కుమార్, లెక్చరల్స్ తదితరులు పాల్గొన్నారు.
మీ మహేష్ చంద్ర, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్సీ ఇన్చార్జ్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
