మన భారత్, అక్టోబర్ 5, తలమడుగు: మాళవిక సోయాబీన్ విత్తనాలను సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పంట కోత దశకు చేరుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తలమడుగు మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మాళవిక రకం సోయాబీన్ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసినట్లు తెలిపారు. పంట సాగు సమయంలో తగిన విధంగా ఎదుగుదల కనిపించినప్పటికీ, కోత సమయానికి ఆశించిన దిగుబడి రాకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
విత్తనాల నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి విత్తనాల నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరారు. నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల నుంచి అందిన ఫిర్యాదును సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపించి, క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. విత్తనాల నాణ్యత, పంట దిగుబడి తగ్గడానికి గల కారణాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
సోయాబీన్ పంటపై ఆధారపడిన రైతులు నష్టపోకుండా అధికారులు సమస్యను త్వరితగతిన పరిశీలించి పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
