మన భారత్, చిట్యాల: చిట్యాల హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు 2027 సంవత్సరంలో నిర్వహించనున్న శ్రీరామనవమి, గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నూతన ఉత్సవ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా చిట్యాల గ్రామంలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి . గ్రామంలో ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అందరి సహకారంతో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
2026–2027 మూడు ప్రధాన ఉత్సవాల ఉత్సవ కమిటీ
అధ్యక్షులు: సరిగొమ్ముల రాజేందర్
ఉపాధ్యక్షులు: గుండ జనార్ధన్, చిలుముల శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి: గుర్రపు తిరుపతి
కోశాధికారులు: తాటిపల్లి శ్రీనివాస్, క్యాతం మార్కండేయ
సహాయ కార్యదర్శి: గంగాధరి రవీందర్
ముఖ్య సలహాదారు: ఆరెపల్లి నరసింహారాములు
గౌరవ కార్యవర్గ సభ్యులు
బుర్ర సదయ్య డీలర్, బైరం భద్రయ్య, కట్కూరి నరేందర్, దేవ శ్రీధర్, బండి సాంబయ్య, బుర్ర కరుణాకర్, గుండ రవీందర్, నేపాలి రాజేష్, మర్రి బిక్షపతి, తూముల రాజు, టేకు లక్ష్మయ్య, మోతే సారయ్య, కింసారపు ప్రభాకర్, ఓర్స్ కొమురయ్య, ముత్యాల నరసయ్య, శనిగరపు మొగిలి, కట్కూరి సారయ్యలను గౌరవ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల గ్రామ ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, 9వ వార్డు సభ్యురాలు వైద్యం శ్రావ్య శ్రీకాంత్, బుర్ర సదయ్య, బుర్ర లక్ష్మణ్, అల్లం సదయ్య, గంగాధరి గణేష్, నేపాలి వేణు, చిలుముల రాజమౌళి, గుండ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ ఆధ్వర్యంలో రానున్న దేవి శరన్నవరాత్రులు, శ్రీరామనవమి, గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామ ప్రజలందరి సహకారంతో మరింత వైభవంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
