manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 9:37 am Editor : Editor Vishal Kumar

15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డులు..

ప్రభుత్వం కీలక నిర్ణయం

మన భారత్, అక్టోబర్ 5, హైదరాబాద్:

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. VB-G RAM G పథకం కింద కొత్తగా జాబ్ కార్డుల మంజూరుకు మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే జాబ్ కార్డు జారీ చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

18 ఏళ్లు నిండిన వారికి అవకాశం

VB-G RAM G పథకం కింద జాబ్ కార్డు పొందేందుకు 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు పొందాలనుకునే అర్హులైన వ్యక్తులు నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుతో ఆధార్, ఫొటో జత చేయాలి

జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఆధార్ కార్డు ప్రతిని, ఫొటోను జత చేయాలి. ఈ దరఖాస్తును గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీకి అందజేయాలి. అందిన దరఖాస్తులను పంచాయతీ స్థాయిలో పరిశీలించి తదుపరి చర్యల కోసం సంబంధిత మండల కార్యాలయానికి పంపిస్తారు.

MPDO పరిశీలన అనంతరం జారీ

పంచాయతీ నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) పరిశీలిస్తారు. అర్హతలు, సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం జాబ్ కార్డు జారీ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తు చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా జాబ్ కార్డు అందించే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు

.కొత్త జాబ్ కార్డుల జారీతో గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారికి ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం లభించనుంది. అర్హత ఉన్న వారు ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియలో పంచాయతీ సెక్రటరీలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.