రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 05 మన భారత్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి బాల బాలికల కబడ్డీ పోటీలు వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా పోటీలు కొనసాగుతుండగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి పరిశీలించి.. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల నిర్వహణ, క్రీడాకారులు పాల్గొనడం పై జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరాల శేఖర్, వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
