manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:45 pm Editor : Editor Vishal Kumar

ఆ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోండి..

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. నెలకు రూ.16,500 గౌరవ వేతనం

అక్టోబర్ 10 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తుల సమర్పణ

మన భారత్, అక్టోబర్ 4, ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు (Children with Special Needs–CwSN) ప్రత్యేక బోధన అందించేందుకు స్పెషల్ ఎడ్యుకేటర్లను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి. మాధవి తెలిపారు. ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాలోని 21 మండలాల పరిధిలో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యా పరంగా అవసరమైన సహకారం, ప్రత్యేక బోధన అందించేందుకు ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర సంబంధిత పత్రాల నకళ్లను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు అర్హతలు

ఈ నియామకానికి కింది విద్యార్హతల్లో ఏదైనా కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* B.Ed. (Special Education)తో గ్రాడ్యుయేషన్
* B.Ed. (General)తో ఒక సంవత్సరం డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్
* B.Ed. (General)తో రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్
* B.Ed. (General)తో PG Professional Diploma in Special Education (PGPD)
* B.Ed. Special Education, PG Professional Certificate in Special Education (PGPC)
* PG Diploma in Special Education (Mental Retardation)
* PG Diploma in Special Education (Multiple Disability: Physical & Neurological)
* PG Diploma in Special Education (Locomotor Impairment and Cerebral Palsy)
* Secondary Level Teacher Training Course in Visual Impairment
* Senior Diploma in Teaching the Deaf
* B.A. B.Ed. in Visual Impairment

పైన పేర్కొన్న విద్యార్హతల్లో నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.

20 పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆదిలాబాద్ జిల్లాలోని సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో సమర్పించాలి. దరఖాస్తులు స్వీకరించే పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి:

1. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, జైనథ్
2. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, బేల
3. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, ఇంద్రవెల్లి
4. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, మన్నూరు
5. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, యాపాలగూడ
6. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, విద్యానగర్
7. పీఎం శ్రీ జడీహెచ్‌ఎస్, బాలక్ మందిర్
8. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, కప్పర్ల
9. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, తలమడుగు
10. పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్, సోనాల
11. పీఎం శ్రీ జడ్సీహెచ్‌ఎస్, ఇచ్చోడా
12. పీఎం శ్రీ జడ్సీహెచ్‌ఎస్, ఉట్నూర్ (టి/ఎం)
13. పీఎం శ్రీ టీజీఎంఎస్, నార్నూర్
14. టి.డబ్ల్యూ. ఆశ్రమ హైస్కూల్ గర్ల్స్, కోస్లాపూర్
15. పీఎం శ్రీ టీజీఎంఎస్, గుడిహత్నూర్
16. పీఎం శ్రీ టీజీఎంఎస్, బజార్‌హత్నూర్
17. పీఎం శ్రీ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, బోథ్
18. టి.డబ్ల్యూ. ఆశ్రమ హైస్కూల్ గర్ల్స్, లకన్పూర్
19. పీఎం శ్రీ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఇచ్చోడా
20. టి.డబ్ల్యూ. ఆశ్రమ హైస్కూల్ గర్ల్స్, ఉట్నూర్

అక్టోబర్ 10లోగా దరఖాస్తులు

అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, సంబంధిత ఇతర పత్రాల నకళ్లతో కూడిన దరఖాస్తులను 2026 అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో సమర్పించాలని అధికారులు సూచించారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అందే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని జిల్లా విద్యాశాఖాధికారి డి. మాధవి స్పష్టం చేశారు.

నెలకు రూ.16,500 గౌరవ వేతనం

ఈ నియామక ప్రక్రియ ద్వారా ఎంపికయ్యే స్పెషల్ ఎడ్యుకేటర్లకు నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వారి అవసరాలకు అనుగుణంగా విద్యాబోధన, మార్గదర్శకత్వం అందించడంలో స్పెషల్ ఎడ్యుకేటర్ల సేవలు కీలకంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియపై మరింత సమాచారం కోసం కార్యాలయ పనివేళల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి