నిర్మల్ అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.!
నేరడిగొండలో రోగి మార్పిడిపై స్థానికుల తీవ్ర ఆగ్రహం నేరడిగొండ, మన భారత్: నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి ఓ అత్యవసర రోగిని తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నేరడిగొండ మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో నిర్మల్ అంబులెన్స్ను నిలిపివేసి, అందులోని రోగిని నేరడిగొండ స్థానిక 108 అంబులెన్స్లోకి మార్చడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న స్థానికులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ సిబ్బంది తీరుపై...