manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 11:57 am Editor : Editor Vishal Kumar

నిర్మల్ అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.!

నేరడిగొండలో రోగి మార్పిడిపై స్థానికుల తీవ్ర ఆగ్రహం

​నేరడిగొండ, మన భారత్:
​నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి ఓ అత్యవసర రోగిని తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నేరడిగొండ మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నిర్మల్ అంబులెన్స్‌ను నిలిపివేసి, అందులోని రోగిని నేరడిగొండ స్థానిక 108 అంబులెన్స్‌లోకి మార్చడం కలకలం రేపింది.
​సమాచారం అందుకున్న స్థానికులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వరకు వెళ్లాల్సిన అంబులెన్స్, మధ్యలోనే స్థానిక అంబులెన్స్‌లోకి రోగిని బదిలీ చేసి తమ బాధ్యత నుంచి తప్పుకోవడం ఏంటని నిలదీశారు.
​నేరడిగొండ మండల ప్రజలకు అత్యవసర వైద్య సేవల కోసం కేటాయించిన 108 అంబులెన్స్‌ను ఇలా ఇతర ప్రాంతాల కేసులకు మళ్లించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇదే సమయంలో నేరడిగొండ పరిసర ప్రాంతాల్లో ఏవైనా ఘోర రోడ్డు ప్రమాదాలు లేదా అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తితే, స్థానిక ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. అంబులెన్స్ అందుబాటులో లేక ప్రాణనష్టం జరిగాతే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను నిలదీశారు.
​అత్యవసర సేవల విషయంలో సిబ్బంది ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీ గజ్జెలు పురుషోత్తం, మన భారత్, రిపోర్టర్, నేరడిగొండ.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.