manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 4:26 am Editor : Editor Vishal Kumar

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..

మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు..

ప్రత్యేక గ్రామసభలో గ్రామ సమస్యలపై చర్చ

మన భారత్, అక్టోబర్ 2, తలమడుగు: తలమడుగు మండలంలోని సాకినాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మెస్రం నికిత నాగేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.

సర్పంచ్ మెస్రం నికిత నాగేష్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యం, శాంతి, అహింసా మార్గాలను పాటిస్తూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని తెలిపారు. గాంధీజీతో పాటు దేశం కోసం సేవలందించిన మహనీయుల ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. యువత గాంధీజీ జీవిత చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తిని తెలుసుకుని సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించేలా ముందుకు సాగాలని సూచించారు.

గ్రామ సమస్యలపై ప్రత్యేక గ్రామసభ

గాంధీ జయంతి సందర్భంగా అనంతరం సాకినాపూర్ గ్రామంలో ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో చర్చించారు. ప్రజలు తమ సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకురాగా, వాటిపై సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బందితో చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఏఈఓ సౌమ్య, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

[