manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 3:44 am Editor : Editor Vishal Kumar

పౌష్టికాహారంపై ఆహార కమిషన్ చైర్మన్ పర్యవేక్షణ

అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పౌష్టికాహారంపై ఆహార కమిషన్ చైర్మన్ పర్యవేక్షణ

నాణ్యత విషయంలో రాజీ వద్దు.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో పోషకాహారం అందించాలి

మన భారత్, సెప్టెంబర్ 30, తలమడుగు: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులు, విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, విటమిన్‌ పదార్థాలు, ఇతర ఆహార సరుకుల పంపిణీపై రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ పర్యవేక్షణ నిర్వహించారు. ఆయా కేంద్రాలు, పాఠశాలలను సందర్శించి ఆహార పదార్థాల నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానం, పిల్లలకు అందుతున్న పౌష్టికాహార వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, విటమిన్‌ పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ సూచించారు. చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పోషకాహారం సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆహార పదార్థాల నిల్వ, పంపిణీ సమయంలో నాణ్యతా ప్రమాణాలను

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.