యువతకు విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, సెప్టెంబర్ 30 (మన భారత్): బోథ్ నియోజకవర్గ యువతకు విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఏటీసీ (ATC) సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బోథ్ మండలం పోచ్ఛర శివారులో నిర్మించనున్న ఈ కేంద్రానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన శిక్షణ, అధ్యయన వసతులను అందుబాటులోకి తీసుకురావడమే ఏటీసీ సెంటర్ ఏర్పాటు ఉద్దేశమని తెలిపారు. కేంద్రం నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఏటీసీ సెంటర్ అవసరాన్ని గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మంజూరు కోసం కృషి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బోథ్ ప్రాంత యువత స్థానికంగానే శిక్షణ, విద్యా అవకాశాలను వినియోగించుకునేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే క్రమంలో ఇచ్చోడలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, నవోదయ పాఠశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
