manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 9:15 pm Editor : Editor Vishal Kumar

రూ.10 లక్షలతో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ..

రూ.10 లక్షలతో వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

ఇచ్చోడలో విద్యాభివృద్ధికి త్వరలో రూ.7 కోట్లతో పనులు ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, సెప్టెంబర్ 29, ఇచ్చోడ: ఇచ్చోడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న వీవో భవన నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ నిర్వహించారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

భూమిపూజ అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇచ్చోడలో విద్యాభివృద్ధికి రూ.7 కోట్లు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఇచ్చోడ మండల కేంద్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సుమారు రూ.7 కోట్లతో విద్యాభివృద్ధికి సంబంధించిన వివిధ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

మండల అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతూ ఇచ్చోడ మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.