రిమ్స్ అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు
చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మన భారత్, సెప్టెంబర్ 28, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేసిన రూ.5 లక్షల నష్టపరిహార చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం సబా కుటుంబ సభ్యులకు సోమవారం రిమ్స్లో చెక్కును అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారి మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.
రిమ్స్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై అధికారులు చేపడుతున్న చర్యలు, ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లను కూడా ఈ సందర్భంగా పరిశీలించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఇచ్చోడ మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, నెరడిగొండ మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ జహీర్, సర్పంచ్ రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్, యునుస్ అక్బని తదితరులు పాల్గొన్నారు.

హాస్నాపూర్లో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మృతుల కుటుంబాలకు పరామర్శ.. చిలుక ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం
మన భారత్, తాంసి: తాంసి మండలం హాస్నాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చిలుక ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
చిలుక ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి తనవంతుగా ఆర్థిక సహాయం అందించి, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రసాద్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం హాస్నాపూర్ గ్రామానికి చెందిన గ్రామ కొత్వాల్ అనుపట్ల విట్ఠల్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతికి గల వివరాలను తెలుసుకున్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే గ్రామానికి చెందిన కంది గణపతి రెడ్డి ఇటీవల స్వర్గస్తులైన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ విషాద సమయంలో తమకు అండగా ఉంటామని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట తాంసి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
[
