manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 7:18 pm Editor : Editor Vishal Kumar

రైతులకు శిక్షణ కార్యక్రమము

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 29, మన (భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏటీఎం ఏ పథకంలో భాగంగా ‘పూర్వ జ్ఞాన గుర్తింపు’ ఆర్ పి ఎల్ రైతులకు శిక్షణ అవగాహన కార్యక్రమము మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ, అధికారులు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో వరిలో విత్తనోత్పత్తి పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులకు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు,

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, జయశంకర్ భూపాలపల్లి శాస్త్రవేత్త కోఆర్డినేటర్ కె. మదన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని రైతులకు వివరిస్తూ ముఖ్యంగా తెలంగాణలో సుస్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి విత్తన సరఫరా అనే అంశం మీద నాబార్డు వారి ఆర్థిక సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చేపట్టిన ప్రాజెక్ట్ లో భాగంగా పిఎసిఎస్ మొగుళ్ళపల్లి వారికి వరి కే ఎన్ ఎం1638విత్తనోత్పత్తిని ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

అలాగే వరి విత్తనోత్పత్తి చేపట్టే రైతులు నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు విత్తన నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ మొగుళ్ళపల్లి చైర్మన్ నర్సింగరావు , మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ ,రైతులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.