మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే
మన భారత్, సెప్టెంబర్ 28 ,తాంసి: తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ రెడ్డి కుటుంబాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. వినోద్ రెడ్డి అత్తమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం జామిడి గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వినోద్ రెడ్డి, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్తో పాటు మండల నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
