manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 8:50 pm Editor : Editor Vishal Kumar

ప్రజావాణిలో దరఖాస్తు తీసుకోలేదని ఆరోపణ

అంగవైకల్యం ఉన్న తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితుడి ఆవేదన.. కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి

మన భారత్, సెప్టెంబర్ 28 ,తాంసి: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తన దరఖాస్తును ఎంపీడీవో స్వీకరించలేదని కప్పర్ల గ్రామానికి చెందిన చుక్కబొట్ల పొచన్న ఆరోపించారు. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజావాణికి వచ్చినప్పటికీ దరఖాస్తు స్వీకరించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పొచన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచే ప్రజావాణి కార్యక్రమం వద్ద వేచి ఉన్నప్పటికీ తనను పట్టించుకోలేదని పేర్కొన్నారు. తన సమస్యకు సంబంధించిన దరఖాస్తును అధికారులకు అందజేసేందుకు ప్రయత్నించినా స్వీకరించలేదని ఆరోపించారు.

తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో తనను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కప్పర్ల గ్రామ సర్పంచ్ అరుణ్‌ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తన దరఖాస్తును స్వీకరించి సమస్యను పరిశీలించేలా జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చుక్కబొట్ల పొచన్న కోరారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.