manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 11:09 pm Editor : Editor Vishal Kumar

చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు

విద్యార్థులను అభినందించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్

మన భారత్, గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని విజేతలను అభినందించారు.

ఈ సందర్భంగా గోడం నగేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విద్యతో పాటు సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రతిభను పెంపొందించుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం, సీనియర్ నాయకులు జి.వి. రమణ, గణేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.