రక్త చరిత్రను సృష్టించిన పోతుగల్లు..గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం
– ఇసుక లోడింగ్ సమస్యతో రెండు వర్గాల మధ్యన చెలరేగిన వివాదం
-సమస్య తీవ్రరూపం దాల్చడంతో సోమవారం ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, పరస్పర దాడులు
-బ్లేడ్ లతో దాడులు చేసుకోవడంతో కొంతమందికి తీవ్ర గాయాలు
-భయాందోళనలో గ్రామస్తులు
-సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరిన సీఐ సతీష్, ఎస్ఐ ముప్పు సురేష్, గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతి, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు
-పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సీఐ సతీష్ ఎస్ఐ ముప్పు సురేష్, సర్పంచ్ ఎలిగేటి తిరుపతి
మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 28, (మన భారత్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామం రక్త చరిత్రను సృష్టించింది. గత కొంతకాలంగా ఆ గ్రామానికి సమీపంలో ఉన్న వాగు నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతున్న క్రమంలో ఇసుకను లోడ్ చేసేందుకు గ్రామానికి చెందిన కొంతమంది లేబర్లు రెండు వర్గాలుగా విడిపోయి లోడ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో..ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, స్థానిక సర్పంచ్ ఎలిగేటి తిరుపతి ఇరువర్గాలకు చెందిన వారు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ఆ సమస్య అప్పటి వరకే సద్దుమణిగింది. కాగా రోజురోజుకీ ఈ సమస్య పెరగడంతో సోమవారం రోజున లోడింగ్ చేసే సమయంలో ఇరు వర్గాలకు చెందిన మహిళలు, పురుషులు లోడింగ్ చేసే సమయంలో ఘర్షణ పడ్డారు. కాగా ఆ ఘర్షణ గొడవకు దారితీసింది. దీంతో ఒక వర్గానికి చెందినవారు ముందస్తుగానే మారణాయుధాలైనటువంటి బ్లెడ్లను దగ్గరగా ఉంచుకొని..ఆ బ్లేడ్లతో దాడులు చేయడంతో..కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో గ్రామస్తులంతా భయాందోళనలో ఉన్నారు. గ్రామస్తుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న చిట్యాల సీఐ వై.సతీష్, ఎస్ఐ ముప్పు సురేష్, గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతి, రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఒక ఇసుక మాఫియా గ్రామాన్ని రెండుగా చీల్చి..గ్రామంలోని ప్రజల మధ్యన చిచ్చులు పెడుతూ..పోతుగల్లు గ్రామంలో రక్త చరిత్రను సృష్టిస్తూ..సహజ వనరుల సంపదను కొల్లగొడుతూ..కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుంటున్న ఇసుక మాఫియాపై చర్యలు చేపట్టి..గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
