manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 9:53 pm Editor : Editor Vishal Kumar

పోతుగల్లులో 144 సెక్షన్ అమలు..

మొగుళ్ళపల్లి: సెప్టెంబర్ 28, (మన భారత్):

.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇసుక లోడింగ్ సమస్యతో గ్రామంలోని రెండు వర్గాల లేబర్ ల మధ్య సోమవారం జరిగిన పరస్పర ఘర్షణ, దాడిలో ఒక వర్గానికి చెందిన లేబర్ లు మరో వర్గంపై బ్లేడ్ లతో దాడి చేయడంతో కొంతమందికి రక్తస్రావం జరిగి తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సమస్యను సద్దుమణిగేలా చేసి, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. దీంతో గ్రామంలోని వీధులన్నీ పోలీస్ పహారా మధ్య నిర్మాణస్యంగా మారాయి.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.