బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: కంది శ్రీనివాస్ రెడ్డి
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన కంది శ్రీనివాస రెడ్డి ఆదిలాబాద్, సెప్టెంబర్ 29: బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన కనిపెల్లి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆయనను పరామర్శించారు. క్రాంతినగర్ కాలనీలోని వెంకన్న నివాసానికి వెళ్లిన కంది శ్రీనివాస రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకన్నతో కొద్దిసేపు మాట్లాడి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు,...