నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
మన భారత్, సెప్టెంబర్ 27 ,ఆదిలాబాద్: తెలంగాణ సామాజిక చైతన్యానికి విశేషంగా కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా జీవితంలో విలువలకు, నిబద్ధతకు, లౌకికవాదానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా గుర్తుండిపోతారని అన్నారు. తెలంగాణ సామాజిక, రాజకీయ చైతన్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్రను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, ప్రజా ఉద్యమాల్లో చేసిన సేవలను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ప్రజా సేవలో నిబద్ధత, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ మంచికట్ల ఆశమ్మ, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు అంబకంటి అశోక్, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్ గౌలి సంజీవ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖిజర్ పాషా, ఎస్సీ సెల్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నపూర్ణ, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ బండి దేవిదాస్ చారి, ఆదిలాబాద్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ నాహీద్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దౌలత్రావు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు చంద్రాల రాహుల్తో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
