manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 10:54 pm Editor : Editor Vishal Kumar

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎంపీ గోడం నగేష్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: ఎంపీ గోడం నగేష్

మన భారత్, సెప్టెంబర్ 26, తలమడుగు: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ సూచించారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఎంపీ సందర్శించారు.

ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షల వ్యయంతో పాఠశాలలో నిర్మించిన కాంపౌండ్ వాల్ పూర్తయిన సందర్భంగా గోడం నగేష్ పాఠశాలను సందర్శించి పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లో రాణిస్తూ కజ్జర్ల గ్రామానికి, తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం ఎంపీ గోడం నగేష్‌ను కజ్జర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ అగ్గిమల్ల గంగన్న, గ్రామ పెద్ద చింతలపల్లి దేవారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొమ్ము జ్యోతి, ఉపాధ్యాయులు ఈ. ఎలిజిబెత్ రాణి, ఏం. బడి వాణి ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటి పెళ్లి రాజు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు నైతం పాయల్, మండల మోర్చా అధ్యక్షురాలు శారద పావని స్వామి, కనపర్తి చంద్రకాంత్, జక్కుల ప్రభాకర్, వెంకటస్వామి, నారాయణరెడ్డి, కుంటల శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.