రిమ్స్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికపై అభ్యంతరాలు..
కొత్త నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ఏజెన్సీల ఎంపిక చేపట్టాలని డిమాండ్ మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి గడువు పొడిగింపు వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలు, ఎంపిక విధానాలను అనుసరించి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గడువు పొడిగింపునకు సంబంధిత అధికారులకు ఉన్న అధికార...