manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 2:31 pm Editor : Editor Vishal Kumar

సామూహిక వందేమాతరం గీతాలాపన..

తాంసిలో ఘనంగా సామూహిక వందేమాతరం గీతాలాపన

విద్యార్థులతో కలిసి జాతీయ స్ఫూర్తిని చాటిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు

మన భారత్, సెప్టెంబర్ 25, తాంసి: తాంసి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాంసి జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థులతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమష్టిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

విద్యార్థులంతా ఒకే వేదికపై సమిష్టిగా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది. విద్యార్థుల్లో దేశభక్తి భావన, జాతీయ చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

విద్యార్థుల సమష్టి భాగస్వామ్యం

తాంసి జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, కేజీబీవీ, జూనియర్ కళాశాల, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కూడా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యార్థుల సామూహిక గీతాలాపనతో పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యతల ప్రాధాన్యతను తెలియజేశారు. విద్యార్థులు విద్యతో పాటు దేశం పట్ల బాధ్యత, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  సర్పంచ్  సంతోష్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ యాదవ్, వార్డు సభ్యులు అల్లకట్ట విలాస్, అనాలి అశోక్ నాయుడు, నర్సారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కేజీబీవీ ఎస్‌ఓ, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం, తాంసి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఒకే కార్యక్రమంలో పాల్గొని వందేమాతరం గీతాన్ని ఆలపించడం ద్వారా తాంసిలో జాతీయ స్ఫూర్తిని చాటారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.