manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 12:59 pm Editor : manabharath

బీసీ కులగణన నిర్వహించాలి..

బీసీ కులగణన నిర్వహించాలి

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 25, (మన భారత్):

దేశవ్యాప్తంగా చేపడుతున్న జనాభా లెక్కల (జనగణన) సేకరణలో ఓబీసీలకు ప్రత్యేక కాలం చేర్చి బీసీ కులగణన చేసే వరకు తమ పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ జనాభాలో 52 శాతం పైగా ఉన్న బీసీలపై మొసలి కన్నీరు కార్చే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జనగణనలో కులగణన చేపట్టకపోవడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పేరుకే ఓబీసీ ప్రధాని తప్ప బీసీలకు ఒరిగింది శూన్యమని దుయ్యబట్టారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీ కాలం పెట్టాలని చేసిన తీర్మానంపై బీజేపీ శాసనసభ పక్ష నేతలు వ్యతిరేకంగా వ్యవహరించి వాకౌట్ చేయడాన్ని బీసీ ద్రోహంగా మహేందర్ గౌడ్ అభివర్ణించారు. బీసీ కులగణన సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ‘గల్లీ నుండి ఢిల్లీ వరకు’ పోరుబాటతో పలు ఉద్యమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 4న పాలమూరు నుంచి “బీసీ కులగణన గర్జన” కార్యక్రమాన్ని చేపట్టి, అక్టోబర్ 8న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో పాటు మేధావులు, ప్రొఫెసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి జనగణనలో ఓబీసీ కాలంను చేర్చాలని, లేకుంటే దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు. బీసీలంతా ఐక్యతతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.