manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:46 am Editor : manabharath

అడవిపందుల బీభత్సం.. సోయా పంట ధ్వంసం

ఎకరం సోయా పంట నాశనం.. ఆందోళనలో రైతు

మన భారత్, సెప్టెంబర్ 25, తలమడుగు: అడవిపందుల బెడదతో సోయాబీన్ రైతు తీవ్రంగా నష్టపోయాడు. తలమడుగు మండలం పునగూడ గ్రామానికి చెందిన రైతు కుమ్ర ప్రేమలబాయి సాగు చేసిన సోయా పంటను అడవిపందులు ధ్వంసం చేశాయి. నాలుగు ఎకరాల్లో సాగు చేసిన సోయా పంటలో సుమారు ఎకరం మేరకు పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల వర్షాభావ పరిస్థితులతో పంట సాగు విషయంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో అడవిపందులు పొలాల్లోకి చొరబడి పంటను ధ్వంసం చేయడంతో మరింత నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.

రాత్రివేళల్లో పొలాల్లోకి చొరబాటు

అడవిపందులు రాత్రివేళల్లో వ్యవసాయ పొలాల్లోకి వచ్చి సోయా మొక్కలను తొక్కివేయడంతో పాటు పంటను తినడంతో పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతు తెలిపారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి నష్టం జరగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తలమడుగు మండలంలోని పలు గ్రామాల పరిధిలో అడవిపందుల సంచారం పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు స్పందించి పంటలను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పరిహారం అందించాలని విజ్ఞప్తి

అడవిపందుల దాడిలో నష్టపోయిన పంటను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతు కోరారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టానికి తగిన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో అడవిపందులు వ్యవసాయ పొలాల్లోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.