manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 9:09 pm Editor : manabharath

రోస్టర్ విధానం పాటించాలని వినతి..

ప్రీ ప్రైమరీ పోస్టుల నియామకాల్లో పారదర్శకత పాటించాలి

సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలి: బీఆర్‌ఎస్‌ మండల పార్టీ

చిట్యాల, మన భారత్:  మండలంలోని ఆయా, ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల నియామకాల్లో సరైన రోస్టర్‌ విధానాన్ని పాటించి, నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్‌ మండల పార్టీ నాయకులు ఎంఈఓను కోరారు.

నియామక ప్రక్రియలో ఎలాంటి పక్షపాతం, రాజకీయ జోక్యానికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. రోస్టర్‌ విధానాన్ని సక్రమంగా అమలు చేస్తూ, అర్హతలు మరియు ప్రభుత్వ నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, మండల యూత్‌ ప్రెసిడెంట్‌ తౌటం నవీన్, ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్ రావు, టౌన్‌ ప్రెసిడెంట్‌ బుర్ర శ్రీధర్ గౌడ్, జూకల్ సర్పంచ్‌ ఎలగొండ తిరుపతి, మాజీ సర్పంచ్‌ పుట్టపాక మహేందర్ పాల్గొన్నారు.

మీ శీలపాక  రాజు, మన భారత్, జర్నలిస్టు, చిట్యాల 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.