manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 11:11 pm Editor : Editor Vishal Kumar

కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా..

ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు సీఈసీ రాజీనామా చేయాలి

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన..

జిల్లా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, సెప్టెంబర్ 28, ఆదిలాబాద్: భారత ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పరిణామాలపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ర్యాలీకి ముందు గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వద్ద మహాత్మా గాంధీ, డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ వైపు నిరసన ర్యాలీగా బయలుదేరారు.

కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితా అంశాల్లో స్పష్టత, ఎన్నికల సంఘం విశ్వసనీయతపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ఎదుట ధర్నా

అనంతరం కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సంఘం తీరుపై నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనానికి కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అనంతరం కాంగ్రెస్ నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాబూరావు, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, జైనథ్ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, పిచ్చోడా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరం సత్యవతి కోటేష్, బోథ్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజర్ పాషా, ఎస్సీ విభాగం చైర్మన్ పరమేశ్వర్, ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సేద్మకి ఆనంద్ రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నపూర్ణ, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు కపిల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతి రామ్, మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బూరుగుల మల్లేష్ పాల్గొన్నారు.

మావల సర్పంచ్ చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నాయకులు నాహిద్, అట్ల గోవర్ధన్ రెడ్డి, రెండ్ల రాజన్న, సురేష్, అలీం, రూపేష్ రెడ్డి, పోతా రెడ్డి, అనీష్ గుడాలా తదితరులతో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.