manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 2:42 pm Editor : manabharath

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్):

తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు, వందల కోట్ల ఆస్తులకు ఎలా అధిపతులు అయ్యారని జయశంకర్ భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెరుగు సురేష్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు.సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే, 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు.”ఉద్యమంలో బండి తిప్పడానికి పెట్రోలుకు డబ్బులు లేవని చెప్పిన వాళ్లు, ఇవాళ ఫాంహౌజులు, ప్రైవేట్ కంపెనీలు, బినామీ ఆస్తులతో వందల కోట్లకు పడగలెత్తారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఇది తెలంగాణ ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నుల సొమ్ము కాదా?” అని మెరుగు సురేష్ గౌడ్ ధ్వజమెత్తారు.ధరణి పోర్టల్ పేరుతో వందల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని భూదందా చేశారని, పేదల భూములను కబ్జా చేసిన ఘనత కేటీఆర్, హరీష్ రావు దేనని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడం సరైన నిర్ణయమని, అసెంబ్లీలో వాళ్లు ఎంత అడ్డుకున్నా నిజం బయటకు వస్తుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే రైతులకు న్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను మళ్లీ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మెరుగు సురేష్ గౌడ్ పేర్కొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.