విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం
తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర పోషిస్తాయని తలమడుగు తహసీల్దార్ బి. రాజమోహన్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి బోధనోపకరణాల మేళాను తహసీల్దార్ బి. రాజమోహన్, ఎంపీడీవో శంకర్, ఎంఈవో జి. వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని 35కు పైగా పాఠశాలలకు...