త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..
మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండలికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి దంపతులు గణనాథుడికి పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి,...