manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 12:28 pm Editor : manabharath

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండలికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి దంపతులు గణనాథుడికి పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, చైర్మన్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. వేద పండితులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

వినాయక ఉత్సవాల సందర్భంగా మావలలో భక్తి వాతావరణం నెలకొంది. గణనాథుడిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మండలి ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ గొంటిముక్కుల  ప్రసాద్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జ్

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.