manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:36 pm Editor : manabharath

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం

-మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్

మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్):

వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో మొగులపల్లి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు , భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలు అధిక శబ్దంతో, కూడిన సిస్టమ్ ల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు నిబంధనలను పాటించాలన్నారు. నిమజ్జన మార్గంలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఊరేగింపు సమయంలో పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని, ప్రతి ఒక్కరు సోదరభావంతో వ్యవహరించి భక్తిశ్రద్ధలతో వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని ఎస్ ఐ ముప్పు సురేష్ కోరారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.