manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:19 pm Editor : manabharath

మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం

తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం: జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు
మన భారత్, సెప్టెంబర్20, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జిల్లా నాయకత్వం ఆమె నియామకాన్ని అధికారికంగా ఖరారు చేసింది. తనపై నమ్మకంతో ఈ కీలకమైన బాధ్యతను అప్పగించినందుకు ఆమె పార్టీ జిల్లా, మండల నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శార్థ పావని స్వామి మాట్లాడుతూ.. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించినందుకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) గోడం నగేష్ , ఆదిలాబాద్ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) పాయల్ శంకర్ , బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం  అలాగే జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జాదవ్ సుమన్ బాయ్, తలమడుగు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా మహిళా సమాజ శ్రేయస్సుకు నిరంతరం శ్రమిస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, సదుపాయాలు అందేలా మండల పార్టీ నాయకుల సహకారంతో తన వంతు పూర్తి బాధ్యతగా కష్టపడతానని, పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయనని ధీమా వ్యక్తం చేశారు. ఆమె నియామకం పట్ల మండల బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.