manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 4:14 pm Editor : Editor Vishal Kumar

మాజీ మంత్రి చిలుకూరి రామచంద్ర రెడ్డికి ఘన నివాళులు

తేనేటి విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.. కుటుంబ సభ్యులతో ఆత్మీయ పలకరింపు

మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో చిలుకూరి లక్ష్మారెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన తేనేటి విందు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, జిల్లా నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ చిలుకూరి రామచంద్ర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం అల్లూరి సంజీవరెడ్డి, చిలుకూరి లక్ష్మారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పార్టీకి, ప్రజలకు సేవలందించిన నాయకుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష సతీష్, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ, డీసీసీ జనరల్ సెక్రటరీ గౌలి సంజయ్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డేరా కృష్ణ రెడ్డి, రుక్మ రెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తేనేటి విందు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.